ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనసహస్ర
శిష్యుడు-1గ్రీష్మిక
శిష్యుడు-2అన్షుక్
నారదుడునన్దిని
వ్యాసుడుసాయిహర్షిత
పరీక్షిత్సత్యారవింద
మంత్రిమైత్రేయి
భటుడు-1అక్షర
పూజారి-1గ్రిహిత సాయి
భటుడు-2అనిరుధ్
పూజారి-2రోషిణి
మునిసూర్య
నర్తకిఖ్యాతిశ్రీ,
హన్సుజ
నిత్యహంసిని
కలిపురుషుడుఆశ్రిత్
శమీకుడుసాయి సంహిత
శృంగిఅర్జున్
గౌరుడుజయేశ్
జనమేజయుడుశ్రీవత్స
శుకుడుతన్వి
భక్తులుచైతన్య
పూజిత
వృషిత
ప్రణవ్ సాయి
2.2 కలియుగములోని భక్తుల సందిగ్ధము

[నారదుడు, వ్యాసుడు ఒక ప్రక్కగా కూర్చొనియుండుదురు.
పూజారులు ఒక దేవాలయము ద్వారము దగ్గ్ర నిలబడి భక్తులకు శఠగోపంతో ఆశీర్వదించుచుండును.
రెండవ ద్వారం దగ్గర ఎవ్వరు ఉండరు.]

పూజారులు: ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా! [ప్రదక్షిణము చేయును]


పూజారి-2: ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టవలసిన సమయము ఆసన్నమయినది.


పూజారులు:
["కోరికలు గల వారు/తీర్చుకోవాలనుకున్న వారు" అని ఒక నినాదమును దూరముగానున్న మొదటి ద్వారమునకు తగిలించెదరు. "కోరికలు లేని వారు/వద్దనుకున్న వారు" అని ఇంకొక నినాదమును వారికి దగ్గరగానున్న రెండవ ద్వారమునకు తగిలించెదరు.]

భక్తులు: [రెండవద్వారము దగ్గర] ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా! [ప్రదక్షిణము చేయును]


పూజారులు: భక్తులారా!

పూజారి-2:
ఆటు వెళ్తే, మీకోరికలు తీరునేమోగానీ, మోక్షానికి మాత్రం ఎన్ని యుగాలు పట్టునో! మరి ఇంకా చాలా తొక్కిసలాట కూడానూ. ఇదిగో ఇటు చూడండి. ఈ రెండవ మార్గంగుండా వెళ్తే, మోక్షము ౘాలా సులభతరమవుతుంది.


భక్తులు:
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా!
[అంటూ తోసుకొని, పూజారులను కూడా క్రిందకు త్రోసి మొదటి మార్గం ద్వారా వెళ్తారు.]

పూజారి-2: ఈ భక్తులను ఆ భగవంతుడే కాపాడాలని నాకోరిక.


పూజారులు: ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా!