ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనసహస్ర
శిష్యుడు-1గ్రీష్మిక
శిష్యుడు-2అన్షుక్
నారదుడునన్దిని
వ్యాసుడుసాయిహర్షిత
పరీక్షిత్సత్యారవింద
మంత్రిమైత్రేయి
భటుడు-1అక్షర
పూజారి-1గ్రిహిత సాయి
భటుడు-2అనిరుధ్
పూజారి-2రోషిణి
మునిసూర్య
నర్తకిఖ్యాతిశ్రీ,
హన్సుజ
నిత్యహంసిని
కలిపురుషుడుఆశ్రిత్
శమీకుడుసాయి సంహిత
శృంగిఅర్జున్
గౌరుడుజయేశ్
జనమేజయుడుశ్రీవత్స
శుకుడుతన్వి
భక్తులుచైతన్య
పూజిత
వృషిత
ప్రణవ్ సాయి
3.6. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గము తెలుపుట (ప్రదేశము: వనప్రాంతము, యజ్ఞ వాటిక)

- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.


ఒక ముని:
రాజా! వ్యాస భగవానుని కుమారుడు, పదహారేళ్ళ బాలుడు, నక్షత్రాల సమూహములో పూర్ణ చంద్రుడిగా వెలుగునొందుచున్న శుక యోగీంద్రులు, అదిగో, మీ అదృష్ట వశాత్తు ఇటే వచ్చుచున్నారు. మీకు ఉపదేశించుటకు ఆయనకంటే తగినవారు ఇంకెవ్వరు లేరు.



- అందరు లేచి నిలబడును -

పరీక్షిత్తు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుడ వైన నీవు సంస్తుతి సేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య! మానసోత్సవమగుచున్.

- అందరూ కలిసి ఈ క్రింది భజన పాడెదరు -

హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె
హరె రామ హరె రామ రామ రామ హరె హరె